nandamuri: నందమూరి సుహాసినికి అందిన నామినేషన్ పత్రాలు

  • కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న సుహాసిని
  • నామినేషన్ పత్రాలను అందించిన టీడీపీ ప్రతినిధులు
  • రేపు నామినేషన్ వేయనున్న సుహాసిని
కూకట్ పల్లి నుంచి టీడీపీ తరపున దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధులు ఆమెకు నామినేషన్ పత్రాలను అందించారు. రేపు ఉదయం తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలకు నివాళి అర్పించిన అనంతరం ఆమె నామినేషన్ వేయనున్నారు. మరోవైపు, సుహాసిని సడన్ ఎంట్రీతో కూకట్ పల్లి నియోజకర్గ ఎన్నికల పర్వం వేడెక్కింది. టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆమె తరపున ప్రచారానికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. 
nandamuri
suhasini
Telugudesam
kukatpalli
nomination

More Telugu News