Chandrababu: చంద్రబాబును విమర్శించే విషయంలో కేసీఆర్ హద్దుల్లో ఉండాలి: కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి

  • చంద్రబాబును తెలంగాణ శత్రువుగా కేసీఆర్ చిత్రీకరిస్తున్నారు
  • చంద్రబాబు పాకిస్థాన్ ఏజెంటు కాదు
  • పీజేఆర్, చంద్రబాబు ఆశీస్సులతోనే ఎన్నికల బరిలోకి దిగా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దివంగత పీజేఆర్ కుమారుడు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని... చంద్రబాబును విమర్శించే విషయంలో కేసీఆర్ హద్దుల్లో ఉండాలని అన్నారు.

 చంద్రబాబు పాకిస్థాన్ ఏజెంటు కాదు కదా? అని ప్రశ్నించారు. పీజేఆర్, చంద్రబాబు ఆశీస్సులతోనే తాను ఎన్నికల బరిలోకి దిగానని చెప్పారు. మహాకూటమి తరపున తొలి విజయం సాధించేది తానే అని ధీమా వ్యక్తం చేశారు. పీజేఆర్ కు పోటీగా ఎవరూ అభ్యర్థిని నిలబెట్టలేదని... కానీ, టీఆర్ఎస్ నిలబెట్టిందని మండిపడ్డారు.

విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాకూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చానని... ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించబోతోందని... టీఆర్ఎస్ కు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
Chandrababu
pjr
kcr
Vishnu Vardhan Reddy
ntr bhavan
congress
Telugudesam
TRS
jubilee hills

More Telugu News