Pawan Kalyan: ఇకపై నా ఇంటిపేరు 'కొణిదెల' కాదు: పవన్ కల్యాణ్

  • ఒక కులానికి నన్ను పరిమితం చేయవద్దు
  • ఇకపై నా ఇంటిపేరు తెలుగు
  • జనసేన వస్తే ప్రజలకు ఉచిత గ్యాస్
  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటన 
తనను ఒక కులానికో, కుటుంబానికో పరిమితం చేయడం సరికాదని, ఇకపై తన ఇంటిపేరు కొణిదెల కాదని, తెలుగు అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తాను తెలుగుజాతికి సంబంధించిన వ్యక్తినని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పౌరుషం, పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం నేటి పాలకుల్లో కనిపించడం లేదని అన్నారు.

అడ్డదారిలో సీఎం అయిన చంద్రబాబులా తాను మాటలు మార్చబోనని చెప్పారు. కృష్ణా గోదావరి బేసిన్ లో అపారమైన చమురు నిల్వలు ఉన్నందునే తాను ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ను సరఫరా చేస్తానని చెప్పానని అన్నారు. తన ప్రభుత్వం వస్తే, దివ్యాంగులు పింఛన్ కోసం బయటకు రావాల్సిన అవసరం లేదని, అధికారులే ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తారని చెప్పారు. ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా, బాధ్యతతో నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Konidela
Telugu
East Godavari District

More Telugu News