కూకట్ పల్లి రాజకీయం.. ఈరోజు మీడియాతో మాట్లాడనున్న నందమూరి సుహాసిని!
- టీడీపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు
- సహకరించాలని స్థానిక నేతలకు సూచన
- ప్రత్యామ్నాయ పదవులతో ఆదుకుంటామని హామీ
ఎన్టీఆర్ కుటుంబానికి టికెట్ ఇస్తున్నందున అందరూ మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. కాగా, కూకట్ పల్లి టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావు, ప్రేమకుమార్ తో బాబు మాట్లాడారు. సుహాసిని గెలుపుకు సహకరించాలనీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులు ఇచ్చి ఆదుకుంటామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు.