tiger shroff: అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.. ఛాన్స్ వస్తే అతనితో తప్పకుండా నటిస్తా!: టైగర్ ష్రాఫ్

  • హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి
  • బిరియానీ, కబాబ్ రుచి చూస్తా
  • తల్లిదండ్రులు లేకుంటే మనం లేము
ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ హైదరాబాద్ లో సందడి చేశాడు. కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఏర్పాటు చేసిన లైఫ్ స్టయిల్ షోరూమ్ ను ప్రారంభించాడు. అనంతరం అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులను తన డ్యాన్స్, స్టంట్స్ తో అలరించాడు. ఈ సందర్భంగా టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారని తెలిపాడు.

హైదరాబాద్ కబాబ్, బిరియానీల గురించి విన్నాననీ, వాటిని రుచి చూస్తానని చెప్పాడు. తన తండ్రి జాకీ ష్రాఫ్ తెలుగు సినిమాల్లో నటించారని గుర్తుచేశాడు. తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. ఇక టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమనీ, అవకాశం వస్తే బన్నీతో తప్పకుండా నటిస్తానని మనసులోని మాటను బయటపెట్టాడు.
tiger shroff
Allu Arjun
FAN
Tollywood

More Telugu News