vijay: చరణ్ రికార్డును అధిగమించిన విజయ్!

షార్ట్స్‌లో చూడండి
విజయ్ కథానాయకుడిగా .. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' ఓపెనింగ్స్ విషయంలోనే రికార్డును సృష్టించింది. ఆ తరువాత అదే ఊపును కొనసాగిస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఒక సమస్య - ఒక సందేశంతో కూడిన కథలను ఎంచుకుంటూ విజయ్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వెళుతున్నాడు.

'బాహుబలి'ని మినహాయిస్తే సౌత్ లో 'రోబో' .. 'కబాలి' .. 'మెర్సల్' .. 'రంగస్థలం' సినిమాలు 200 కోట్ల క్లబ్ లోకి చేరాయి. తాజాగా 'రంగస్థలం' వసూళ్లను అధిగమించిన విజయ్, రెండవసారి 200 కోట్ల క్లబ్ లో తన సినిమాను నిలబెట్టాడు. 'రంగస్థలం' 215 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 'సర్కార్' ఇంతవరకూ 217 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాది సౌత్ ఇండియాలో అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.  
Go Back to Shorts
vijay
keerti
varalakshmi

More Telugu News