vijay devarakonda: నా పరాజయాలు చూసి ఎంజాయ్ చేసేవారిని చేయమనే చెబుతాను: విజయ్ దేవరకొండ

  • ఒక్కరోజులో స్టార్ ను కాలేదు 
  • కొంతమంది ఈర్ష్య పడుతున్నారు 
  • సక్సెస్ లతోనే సమాధానం
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన 'టాక్సీవాలా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది. నా నుంచి ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. థియేటర్స్ నుంచి బయటికి వస్తూ 'కొత్తగా చేశాడ్రా' అనే చెప్పుకుంటారు. ఇక నా గురించి చెడుగా ప్రచారం చేసేవారు చేస్తూనే వున్నారు.

వాళ్లు అనుకుంటున్నట్టుగా నేను ఒక్క రోజులో స్టార్ ను కాలేదు. ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. నా ఎదుగుదల చూసి కొంతమంది జెలసీ ఫీలవుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్లు నా పరాజయాలు చూసి ఎంజాయ్ చేస్తామంటే చేయమనే చెబుతాను. నేను ఎవరితోనూ కలవననే ప్రచారం కూడా చేస్తున్నారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఈర్ష్య పడేవారికి సక్సెస్ లతోనే సమాధానం చెప్పాలనుకుంటున్నాను" అని అన్నాడు.  
vijay devarakonda

More Telugu News