Kerala: కొచ్చి విమానాశ్రయంలోనే తృప్తి దేశాయ్... బయట అయ్యప్ప భజనలు చేస్తున్న కేరళ మహిళలు!

  • కొచ్చి చేరుకున్న తృప్తి దేశాయ్
  • అడ్డుకున్న నిరసనకారులు
  • అదనపు బలగాలను రప్పిస్తున్న పోలీసులు
తాను శబరిమలకు వెళతానని పట్టుబట్టి, కొచ్చి చేరుకున్న భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ ని అడ్డుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు, మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తృప్తి ఇంతవరకూ ఎయిర్ పోర్టు నుంచి ఇంకా బయటకు రాలేదు. బయట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

మరోపక్క, ఆమెను అడ్డుకునేందుకు వచ్చిన నిరసనకారులు, విమానాశ్రయం వెలుపలికి దారితీసే గేట్ల ముందు కూర్చుని అయ్యప్ప భజనలు చేస్తున్నారు. వీరిలో కేరళ మహిళలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. దీంతో తృప్తి దేశాయ్, విమానాశ్రయం లోపలే ఉండిపోవాల్సిన పరిస్థితి. తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని, స్వామి దర్శనానికి తాను వెళ్లి తీరుతానని ఆమె స్పష్టం చేస్తున్నారు. కొచ్చి విమానాశ్రయం ప్రాంతానికి అదనపు బలగాలను రప్పిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Kerala
Sabarimala
Airport
Trupti Desai
Protest

More Telugu News