Chandrababu: చంద్రబాబు లాగే పవన్ కూడా మాట్లాడుతున్నారు: వైసీపీ నేత బొత్స విమర్శ

  • జగన్ పై దాడి ఘటనపై బాబు మాదిరే పవన్ మాటలు
  • అధికార పార్టీ డైరెక్షన్ లో నడుస్తున్న పవన్  
  • కులాలతో సంబంధం లేదంటూనే మాట్లాడుతున్నారు
వైఎస్ జగన్ పై దాడి కేసు విషయంలో సీఎం చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారో, అదేవిధంగా పవన్ కల్యాణ్ కూడా మాట్లాడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని విమర్శించారు.

తను ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి విమర్శలు చేయడం కాదని, పవన్ ప్రజల తరపున పోరాడాలని అన్నారు. తనకు కులాలతో సంబంధం లేదని చెబుతూనే వాటి గురించి పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించానని గొప్పలు చెప్పుకుంటున్న పవన్, అసలు ఆయన అప్పుడు రాజకీయాల్లో ఉన్నారా? అని బొత్స ప్రశ్నించారు.
Chandrababu
Pawan Kalyan
Botsa Satyanarayana
Telugudesam
YSRCP

More Telugu News