ఉత్తరాంధ్ర సుజల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- ఫేజ్-1ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం
- ఈ ప్రాజెక్ట్ తో సస్యశ్యామలం అవుతుంది
- మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా నీటి కష్టాలు తొలగిస్తామని, మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేశామని, ఈ నెలలోనే గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్విభజన గురించి చంద్రబాబు ప్రస్తావించారు. విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని, రాష్ట్రానికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు.