Congress: ఎక్కువ కేసులున్నవారికే ‘కాంగ్రెస్’ టికెట్లిస్తోంది!: గట్టు రామచంద్రరావు

షార్ట్స్‌లో చూడండి
టీ-కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేకుండా పోయిందని, ఎక్కువ కేసులున్న వారికే ఆ పార్టీ టికెట్లు, పదవులు ఇస్తోందని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా కావాలంటే క్రిమినల్ యాక్టివిటీ ఉండాలా? అని ప్రశ్నించారు.

'కారులో మూడు కోట్ల రూపాయలు తరలిస్తూ వాటిని తగులబెట్టుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీ-పీీసీసీ ప్రెసిడెంటా? ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, పాస్ పోర్ట్ కేసులో ఇరుక్కున్న కుసుమకుమార్ మరో వర్కింగ్ ప్రెసిడెంట్' అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఓ రౌడీషీటర్ అని.. ఇలాంటి అభ్యర్థులకు టికెట్లిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు అభాసుపాలవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Congress
TRS
Uttam Kumar Reddy
Revanth Reddy
gattu

More Telugu News