Harish Rao: కాంగ్రెస్, టీడీపీ వాళ్లకు ఓట్లు వేసీవేసీ ప్రజల చేతులు నొప్పులు పుట్టాయి: మంత్రి హరీశ్ రావు

  • ఆ రెండు పార్టీలతో తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు
  • కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు
  • తెలంగాణ ద్రోహి వైఎస్ రాజశేఖరరెడ్డి
కాంగ్రెసోళ్లకు, టీడీపీ వాళ్లకు ఓట్లు వేసి ప్రజల చేతులు నొప్పులు పుట్టాయని, ఆ రెండు పార్టీల వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. వేములవాడలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నాడు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదని, వేములవాడ కరవుతో తల్లడిల్లిందని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇక్కడి చెరువులకు నీళ్లొచ్చాయని, సూరమ్మ చెరువుని చూస్తుంటే తన కడుపు నిండిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులైపోయాయని, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరివ్వలేదని, వైఎస్ తెలంగాణ ద్రోహి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
Harish Rao
congress
Telugudesam

More Telugu News