Nokia 106 (2018): నోకియా నుండి ఫీచర్ ఫోన్ వచ్చేసింది!

  • నోకియా 106 (2018) విడుదల 
  • ధర సుమారుగా రూ.1,700
  • త్వరలోనే భారత మార్కెట్లోకి
హెచ్ఏండీ గ్లోబల్ సంస్థ తాజాగా నూతన ఫీచర్ ఫోన్ ని మార్కెట్లో విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన నోకియా 106 (2013)కి కొనసాగింపుగా నోకియా 106 (2018) పేరిట తాజాగా సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం రష్యా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ముదురు బూడిద రంగులో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర మన దేశంలో సుమారుగా రూ.1,700కి వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. అలాగే, దీనిలో 1.8" టీఎఫ్‌టీ డిస్ప్లే , 160 x 120 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ 6261డీ ప్రాసెసర్, 4ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 ఎంబీ ర్యామ్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Nokia 106 (2018)
nokia
Tech-News
Technology
Russia
India

More Telugu News