kaushal: కౌశల్ తో ఇంతవరకూ మాట్లాడలేదు: తనీశ్

  • కౌశల్ ను కలవలేదు
  • గొడవలు కారణం కాదు
  •  కౌశల్ ఆర్మీకి హ్యాట్సాఫ్
'బిగ్ బాస్ 2'లో మొదటి నుంచి కూడా కౌశల్ కి తనీశ్ గట్టిపోటీని ఇస్తూ వచ్చాడు. టాస్క్ ల సమయంలో ఈ ఇద్దరి మధ్య వాదనలు ఎక్కువగా జరిగేవి. ఫైనల్స్ కి దగ్గరగా వెళుతోన్న సమయంలో ఇద్దరి మధ్య గొడవలు ఒక రేంజ్ కి చేరుకున్నాయి. ఆ తరువాత 3వ స్థానంలో తనీశ్ బయటికి రావడం .. కౌశల్ విన్నర్ కావడం జరిగిపోయాయి.

తాజా ఇంటర్వ్యూలో కౌశల్ గురించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అప్పుడు తనీశ్ స్పందిస్తూ .. 'బిగ్ బాస్ 2' హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత నేను కౌశల్ ను కలుసుకోలేదు .. ఆయనతో మాట్లాడలేదు. అందుకు కారణం బిగ్ బాస్ హౌస్ లో ఉండగా మా మధ్య జరిగిన గొడవలు కాదు. నా పనుల్లో నేను .. తన పనుల్లో తను బిజీగా ఉండటమే అందుకు కారణం. ఇక కౌశల్ ఆర్మీ గురించి తనీశ్ స్పందిస్తూ "వాళ్లంతా ఎంతో ప్రేమతో ఆయనను గెలిపించారు .. అందుకు హ్యాట్సాఫ్' అని అన్నాడు.   
kaushal
thanish

More Telugu News