Crime News: వివాహం అయిన రెండో రోజే వధువు ఆత్మహత్య... విషం తాగడంతో మృతి

షార్ట్స్‌లో చూడండి
పెళ్లయిన రెండో రోజే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఇంటికి భోజనానికి చిన్నాన్నతో కలిసి వెళ్లిన ఆమె అతనితోపాటు విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా చిన్నమనూరు సమీపంలోని పులికుత్తి గ్రామానికి చెందిన పాండియన్‌ (46) రోజు కూలీ. తన కుమార్తె రమ్య (23)ను పెరియకులం సమీపంలోని సరత్తుపట్టికి చెందిన రంగరాజ్‌ (29)కు ఇచ్చి ఈనెల 11న పెళ్లి చేశారు. సోమవారం మరవలి వేడుక కోసం దంపతులు పులికుత్తికి వచ్చారు. ఆ తర్వాత అదే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు.

రమ్య వెంట ఆమె చిన్నాన్న ముత్తుకృష్ణన్‌ (27) కూడా ఉన్నారు. బంధువుల ఇంటికి భోజనానికి వచ్చిన రమ్య, ముత్తుకృష్ణన్‌లు కొద్దిసేపటికే స్పృహతప్పి పడిపోయారు. బంధువులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విషం తాగినట్లు గుర్తించారు. చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా, మెరుగైన వైద్యం కోసం ముత్తుకృష్ణన్‌ను మధురై తరలించారు. వీరి ఆత్మహత్యా యత్నానికి కారణాలు తెలియరాలేదు. రమ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Crime News
Tamilnadu
teni district

More Telugu News