surya: పొలిటికల్ డ్రామాతో సూర్య ఆ రోజునే వస్తాడట!

  • సెల్వరాఘవన్ దర్శకుడిగా 'ఎన్జీకే'
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా 
  • జనవరి 26వ తేదీన విడుదల  
సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' సినిమా చేస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సూర్య సరసన కథానాయికలుగా రకుల్ .. సాయిపల్లవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఫస్టులుక్ తోనే సూర్య ఆసక్తిని రేకెత్తించడంతో, టీజర్ కోసం వాళ్లంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి ఫస్టు వీక్ లో టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందనీ, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని సూర్య భావిస్తున్నాడు.
surya
rakul
sai pallavi

More Telugu News