Sruthi Hariharan: నేను పంచదారనైతే... నా చుట్టూ చేరిన చీమలు మీరు: మీడియాపై హీరోయిన్ శ్రుతి హరిహరన్

  • మహిళా కమిషన్ ముందుకు వచ్చిన శ్రుతి
  • లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చి వచ్చిన శ్రుతి
  • ఆపై మీడియా గురించి ఏమీ అనలేదని వివరణ
దక్షిణాది నటుడు అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, వార్తల్లోకి ఎక్కిన నటి శ్రుతి హరిహరన్, మీడియాపై చిందులేసింది. మహిళా కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన ఆమెతో మాట్లాడేందుకు మీడియా పెద్దఎత్తున చేరుకోగా, "నేను పంచదారలా ఉన్నాను, మీరు చీమల మాదిరిగా నా వెంట పడుతున్నారు" అని వ్యాఖ్యానించింది.

ఆపై లోపలి వెళ్లిన ఆమె,  కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. ఆపై బయటకు వచ్చిన ఆమె, తాను మీడియా గురించి ఏమీ అనలేదని, మీడియాను గౌరవిస్తానని చెబుతూ వెళ్లిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా, లక్ష్మీబాయి.. వేధింపులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సింది పోయి, ఇలా సోషల్ మీడియాకు ఎక్కడం ఏంటని శ్రుతిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.  
Sruthi Hariharan
Women Commission
Media
Sugar
Ants

More Telugu News