East Godavari District: రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో దారుణం... ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుంటే వీడియో తీసిన సూపరింటెండెంట్!

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • కీచకుడిగా మారిన సూపరింటెండెంట్ రియాజ్
  • రహస్య వీడియో చిత్రీకరణను నిన్న కనిపెట్టిన ఉద్యోగిని
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రైల్వే స్టేషన్ లో కీచకుడిగా మారిన ఓ సూపరింటెండెంట్ ఇప్పుడు ఉద్యోగానికి దూరమయ్యాడు. మహిళా ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుంటే, వీడియో తీస్తూ, వాటిని ల్యాప్ టాప్ లో దాస్తూ పట్టుబడ్డాడీ దుర్మార్గుడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, స్టేషన్ లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్, కాగా, అదే స్టేషన్ లో ఓ వివాహిత, గేట్ కీపర్ గా పని చేస్తోంది. ఇటీవల స్టేషన్ లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ తొలగించడంతో, ఆ మహిళ, గదిలో తన దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకునేది. ఈ విషయాన్ని గమనించిన రియాజ్, ఆ గదిలో ఓ సీక్రెట్ కెమెరాను పెట్టాడు. ఆమె గదిలోకి వెళ్లినప్పుడల్లా, వీడియో రికార్డు చేసి దాచసాగాడు.

నిన్న ఆ మహిళ బట్టలు మార్చుకునేందుకు వెళ్లిన వేళ, చిన్న ఎల్ఈడీ బల్బు వెలగడంతో అనుమానం వచ్చిన ఆమె, అసలు విషయాన్ని గుర్తించింది. ఈ విషయంలో ఆమె పై అధికారులను ఆశ్రయించగా, పోలీసులు రంగంలోకి దిగి, రియాజ్, రహస్యంగా వీడియో తీశాడని నిర్ధారించారు. దీంతో డీఆర్ఎం ఆదేశాలతో అతన్ని సస్పెండ్ చేశారు అధికారులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
East Godavari District
Ramachandrapuram
Secret Video
Recording

More Telugu News