mp kavitha: విపక్షాలది ప్రజా కూటమి కాదు...ప్రజల్లేని కూటమి: ఎంపీ కవిత ఎద్దేవా

  • చంద్రబాబుతో పొత్తు అవసరం ఏమిటో ప్రజలకు కాంగ్రెస్‌ వివరించాలి
  • కూటమి కుట్రలు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి
  • పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి భూపతిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌
తెలంగాణ రాష్ట్రంలో విపక్ష పార్టీలు కొన్ని కలిసి ఏర్పాటు చేసుకున్నది ప్రజా కూటమి కాదని, ఆ కూటమికి ప్రజల మద్దతు లేనందున ప్రజల్లేని కూటమి అని నిజామాబాద్‌ ఎంపి కవిత విమర్శించారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబునాయుడుతో జతకట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్‌ ముందు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 నిరంతరం ప్రజల మధ్యనే ఉండే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ని మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి డాక్టర్‌ భూపతిరెడ్డి వెంటనే రాజీనామా చేసి మాట్లాడాలని కోరారు. ఇక డి.శ్రీనివాస్‌పై ఏం చర్యలు తీసుకోవాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
mp kavitha
mahakutami
MLC bhupathireddy

More Telugu News