Hero Ram: రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు: హీరో రామ్

  • వైరల్ అవుతున్న రామ్ పోస్ట్
  • ఓటు వెయ్యడం అన్నది మన బాధ్యత
  • నిజాయతీ గల నాయకుడిని ఎన్నుకోవాలి
తెలంగాణ మొత్తం నామినేషన్లు.. నేతల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో నేతలంతా ఎత్తులకు పై ఎత్తులతో ముందుకెళుతున్నారు. ఈ సమయంలో యంగ్ హీరో రామ్ రాజకీయ నాయకులనుద్దేశించి పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

‘‘రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్లా.. 60 ఏళ్లా.. అన్నది కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలి. అనుభవం ఉన్నవారు నాయకులుగా నిలబడితే మరీ మంచిది. ఓటు వెయ్యడం అన్నది మన బాధ్యత. ఆ హక్కుతో నిజాయతీ గల నాయకుడిని ఎన్నుకోవాలి. దయచేసి ఓటు హక్కును దుర్వినియోగం చేయకండి’’ అని రామ్ పేర్కొన్నారు.

Hero Ram
Politics
Vote
Social Media

More Telugu News