KTR: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు కేటీఆర్‌ను వివరణ కోరిన ఈసీ

  • సిరిసిల్ల సభలో ఆర్ఎంపీ, పీఎంపీలకు వరాలు
  • ప్రాక్టీస్‌కు సహకరించేలా జీవోను సవరిస్తామని వెల్లడి
  • ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇచ్చిన హామీలపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం లేఖ రాసింది. ఇటీవల జరిగిన సిరిసిల్ల సభలో ఆర్ఎంపీ, పీఎంపీలకు వరాలిచ్చారు.

వారికి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేసుకునేలా జీవోను సవరిస్తామని.. ఆర్ఎంపీ, పీఎంపీలకు తమ పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వివరణ కోరుతూ కేటీఆర్‌కు లేఖ రాసింది.
KTR
Election Commission
TRS
Rajath kumar
Congress

More Telugu News