Deepika Padukone: వైభవంగా దీపిక, రణ్‌వీర్‌ల వివాహం!

  • సీప్లేన్‌లో మండపానికి వచ్చిన రణ్‌వీర్
  • సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిన దీపిక
  • రణ్‌వీర్ ఉంగరం తొడుగుతుండగా దీపిక ఉద్వేగం
  • రేపు సింధి సంప్రదాయంలో వివాహం
బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి సంప్రదాయంలో నేడు అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు రణ్‌వీర్ సీప్లేన్‌లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందట. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. నిశ్చితార్థ వేడుకలో భాగంగా రణ్‌వీర్.. దీపిక వేలికి ఉంగరం తొడుగుతుండగా.. దీపిక భావోద్వేగానికి లోనైందని సమాచారం.

అనంతరం ఉదయం 9 గంటలకు మొదలైన వివాహం సాయంత్రం 3గంటలకు ముగిసిందని తెలుస్తోంది. వివాహానికి వచ్చే అతిథులు రిస్ట్ బ్యాండ్స్, శుభలేఖతో రావాలని నిబంధనలు విధించారు. పెళ్లి జరిగే లేక్ కోమో వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రేపు సింధి సంప్రదాయంలో మరోసారి దీప్‌-వీర్‌ల వివాహం జరగనుంది.  
Deepika Padukone
Ranveer singh
Etaly
Savyasachi

More Telugu News