అంతుచిక్కని వ్యాధి కారణంగా.. క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్
- ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జాన్ హేస్టింగ్స్
- బౌలింగ్ వేసిన ప్రతిసారి రక్తపు వాంతులు
- భరోసా ఇవ్వలేకపోతున్న డాక్టర్లు
ఊపిరితిత్తుల పరిస్థితి కారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని ఈ సందర్భంగా హేస్టింగ్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2007లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన హేస్టింగ్స్... ఆస్ట్రేలియా జట్టుతో పాటు, పలు లీగ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా తరపున ఒక టెస్టు, 29 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కోచి టస్కర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.