charan: చరణ్ .. కైరా అద్వానిపై మాస్ మసాలా సాంగ్

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • మాస్ డ్యూయెట్ కి సన్నాహాలు
బోయపాటి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తాజాగా ఆయన ఒక మాస్ మసాలా సాంగ్ కోసం ట్యూన్ ఇచ్చాడట. చరణ్ .. కైరా అద్వానిపై ఈ మాస్ డ్యూయెట్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఐటెమ్ సాంగ్స్ కి ట్యూన్స్ చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ సిద్ధహస్తుడు. ఆయన స్వరపరిచిన కొన్ని ఐటమ్ సాంగ్స్ ఇప్పటికీ అక్కడక్కడా సందడి చేస్తూనే ఉంటాయి. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ .. చరణ్ కోసం అదిరిపోయే మాస్ ట్యూన్ చేశాడని చెబుతున్నారు. ఇక సెపరేటుగా ఐటెమ్ సాంగ్ ఉంటుందా .. ఈ మాస్ డ్యూయెట్ తోనే సరిపెట్టుకోవాలా? అనే విషయంలోనే క్లారిటీ రావాల్సి వుంది.    
charan
kiara

More Telugu News