malaika arora: నా జీవితం గురించి అందరికీ తెలుసు: మలైకా అరోరా

  • వ్యక్తిగత విషయాలపై స్పందించను
  • నా జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్నా
  • జీవితం ఎంతో ఆనందమయంగా ఉంది
బాలీవుడ్ నటీనటులు మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన భర్త అర్భాజ్ ఖాన్ తో 19 ఏళ్లు కాపురం చేసిన తర్వాత 2017లో ఆమె విడాకులు తీసుకుంది. అనంతరం అర్జున్ కపూర్ కు దగ్గరైంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బీటౌన్ లో షికారు చేస్తున్నాయి.

దీనిపై మలైకాను ప్రశ్నించగా... తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి తాను స్పందించనని మలైకా తెలిపింది. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేందుకు తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. తన జీవితం గురించిన అన్ని విషయాలు అందరికీ తెలుసని తెలిపింది. తన జీవితాన్ని తాను హాయిగా అనుభవిస్తున్నానని... తన జీవితం ఎంతో ఆనందమయంగా ఉందని చెప్పింది.
malaika arora
arjun kapoor
marriage
bollywood

More Telugu News