kcr: కోనాయిపల్లి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు.. ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై సంతకం చేయనున్న కేసీఆర్
సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నామినేషన్ పత్రాలపై ఈ ఆలయంలోనే ఆయన సంతకం చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఆయన ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారు. కోనాయిపల్లికి వచ్చిన కేసీఆర్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.