Inagala Peddireddy: హరికృష్ణ కూతురు సుహాసినికి లైన్ క్లియర్... వెంటనే ప్రచారం ఆపివేయాలని పెద్దిరెడ్డికి అధిష్ఠానం అదేశం!

  • గత నెల రోజులుగా కూకట్ పల్లిలో పెద్దిరెడ్డి ప్రచారం
  • అభ్యర్థిని చెప్పకుండా ప్రచారం చేస్తే తప్పుడు సంకేతాలు
  • తెలుగుదేశం అధిష్ఠానం నుంచి పెద్దిరెడ్డికి ఆదేశాలు
కూకట్‌ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తానేనని, గత నెల రోజులుగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, వెంటనే ప్రచారాన్ని ఆపివేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. అభ్యర్థి పేరును చెప్పకుండా, ప్రచారం చేసుకోవడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళతాయని, కాబట్టి, వెంటనే ప్రచారం ఆపాలని ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ స్థానానికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు గత రాత్రి నుంచి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి తాజా ఆదేశాలు వెళ్లగా, సుహాసినికి లైన్ క్లియర్ చేయాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.
Inagala Peddireddy
Kukatpalli
Telugudesam
Nandamuri Suhasini

More Telugu News