priyanka: పవన్ జోడీగా ఛాన్స్ వస్తే అంతకుమించిన అదృష్టం లేదు: 'టాక్సీవాలా' హీరోయిన్

  • పవన్ అంటే ఇష్టం
  • ఆయన జోడీ కట్టాలని వుంది
  • ఆ ఛాన్స్ కోసమే వెయిటింగ్  
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'టాక్సీవాలా' చిత్రం ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ప్రియాంక జవల్కర్ కథానాయికగా పరిచయం కానుంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తనకి అల్లు అర్జున్ పై క్రష్ అని చెప్పిన ఈ సుందరి, తాజా ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించింది.

"పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సరసన కథానాయికగా చేయాలనేది నా డ్రీమ్. ఆయన సినిమాలో చేసే అవకాశం వస్తే అంతకి మించిన అదృష్టం లేదు. పవన్ సరసన చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూనే వుంటాను" అని చెప్పుకొచ్చింది.

'టాక్సీవాలా' విడుదలైతే గ్లామర్ పరంగా ప్రియాంకకి మంచి మార్కులు పడే అవకాశం ఉందని అంటున్నారు. గ్లామరస్ హీరోయిన్ గా ఆమె తన జోరు కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి మరి.
priyanka

More Telugu News