Telangana: రాహుల్ గాంధీకి ఫిర్యాదుల వెల్లువ... సీరియస్!

  • తొలి జాబితా తరువాత వెల్లువెత్తిన అసంతృప్తి
  • ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం
  • మరోసారి పరిశీలించాలని రాహుల్ ఆదేశం
సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను ప్రకటించిన తరువాత, అసంతృప్తులు వెల్లువెత్తగా, పలువురు ఈ జాబితాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. తన వద్దకు వస్తున్న ఫిర్యాదులను చూసిన రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సీరియస్ అయ్యారు.

సీట్లన్నీ తమతమ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాతినిధ్యం లభించిందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన 'పారాచూట్' నేతలకు ఎక్కువ సీట్లిచ్చారని రాహుల్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఆయన, ఈ జాబితాను పునఃసమీక్షించాలని స్క్రీనింగ్ కమిటీకి ఈ ఉదయం ఆదేశాలు ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా తుది జాబితాను సిద్ధం చేయాలని కూడా ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Telangana
Rahul Gandhi
First List
Congress
Elections

More Telugu News