suicide attempt: ప్రియురాలి తీరుతో యువకుడి మనస్తాపం...ఆలౌట్‌ తాగి ఆత్మహత్యా యత్నం

  • బాధితుడు కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిన్నకన్నేపల్లి వాసి
  • హార్డ్‌వేర్‌ శిక్షణ కోసం ఎస్‌ఆర్‌ నగర్‌లో నివాసం
  • ప్రేమికురాలు మాట్లాడడం లేదని, ఫోన్‌ చేస్తే కట్‌ చేస్తోందని ఆవేదన
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడం, ఫోన్‌ చేస్తే కట్‌ చేస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. తాను చనిపోతున్నానని సోదరునికి ఫోన్‌ చేసి చెప్పి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసుల కథనం మేరకు...కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిన్న కన్నేపల్లికి చెందిన హర్ష (21) బీసిఏ చదివాడు. విజయవాడలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు.

ఈ నేపథ్యంలో హార్డ్‌వేర్‌లో శిక్షణ పొందేందుకు కొన్నాళ్ల క్రితం  హైదరాబాద్‌ వచ్చాడు. ఎస్‌.ఆర్‌.నగర్‌లోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఇటీవల సొంతూరుకు వెళ్లి మంగళవారమే తిరిగి ఎస్‌.ఆర్‌.నగర్‌ వచ్చాడు. అనంతరం విశాఖపట్నంలో ఉంటున్న సోదరుడు మనోజ్‌కు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్యకు ప్పాడుతున్నట్లు చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన మనోజ్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌లో ఉంటున్న తన స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే వారు హర్ష ఉంటున్న గది వద్దకు వచ్చి తలుపులు  పగులగొట్టి చూడగా అచేతన స్థితిలో పడివున్న హర్ష కనిపించాడు.

గాజు పెంకుతో చెయ్యి కోసుకోవడమే కాక, ఆలౌట్‌ కూడా తాగేశాడని తెలుసుకుని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హర్ష ప్రేమించిన యువతి ఇటీవలే బదిలీపై హైదరాబాద్‌ వచ్చింది. వచ్చినప్పటి నుంచి ముఖం చాటేస్తుండడం, కలవడానికి కాదు కదా కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడానికి ఇష్టపడక పోవడంతో మనస్తాపంతోనే హర్ష ఆత్మహత్యా యత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
suicide attempt
Hyderanad srnagar
Krishna District

More Telugu News