Andhra Pradesh: నేడు చంద్రబాబు షెడ్యూల్ ఖరారు.. బిజీబిజీగా గడపనున్న టీడీపీ అధినేత!

  • తొలుత పారిశ్రామికవేత్తలతో భేటీ
  • తిత్లీ సహాయక చర్యలపై సమీక్ష
  • బోట్ రేసింగ్ ఏర్పాట్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి ఈ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం తిత్లీ తుపాను సందర్భంగా తీసుకున్న సహాయక చర్యలు, అందించిన సాయంపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు రాజధాని నిర్మాణ పనులను, ఐఏఎస్ క్వార్టర్లలో మోడల్ ఫ్లాట్లను బాబు పరిశీలిస్తారు. తిరిగి సాయంత్రం ఐదున్నర గంటలకు టూరిజం శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అలాగే శుక్రవారం నుంచి ఏపీలో ప్రారంభం కానున్న ఫార్ములా వన్ బోట్ రేసింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆతర్వాత సాయంత్రం 6 గంటలకు విపత్తు నిర్వహణ అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంటారు.
Andhra Pradesh
Chandrababu
Chief Minister
schedule
tour

More Telugu News