Air India: టెన్షన్ పెట్టిన హైదరాబాద్ - తిరుపతి విమానం!

  • సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు
  • వాతావరణం అనుకూలించక ల్యాండింగ్ విఫలం
  • ఆపై సురక్షితంగా దిగిన విమానం
హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, అందులోని 100 మందికి పైగా ప్రయాణికులను కాసేపు ఇబ్బంది పెట్టింది. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి టేకాఫైన విమానం రేణిగుంటకు చేరుకునేసరికి వాతావరణం అనుకూలించలేదు. దీంతో ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతో పైలట్, విమానాన్ని తిరిగి గాల్లోకి లేపాడు. సుమారు గాల్లో పది నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టింది. ఆపై టవర్ నుంచి ల్యాండింగ్ కు అనుమతి రావడంతో విమానం కిందకు దిగింది. అందులోని ప్రయాణికులు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నారు.
Air India
Hyderabad
Tirupati
Flight

More Telugu News