Pawan Kalyan: నేను పంచె ఎందుకు కడుతున్నానంటే.. అసలు విషయాన్ని చెప్పిన పవన్ కల్యాణ్!

  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటేందుకే పంచెకట్టు
  • ఆంధ్రులను దోపిడీ దారులుగా చిత్రీకరించారు
  • రామచంద్రాపురం బహిరంగ సభలో పవన్
తాను ఇటీవల వరుసగా పంచెకట్టుతో కనిపించడం వెనకున్న కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బయటపెట్టారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పంచెకట్టు రహస్యాన్ని వివరించారు. తాను పంచెకట్టడంలో ఎటువంటి విశేషం లేదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటడానికే పంచె కడుతున్నట్టు చెప్పారు.

హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులను దోపిడీ దారులుగా చిత్రీకరిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అవమానిస్తుంటే ఒక్క ఆంధ్రా నాయకుడు కూడా ఇదేంటని ప్రశ్నించలేదన్నారు. కాంట్రాక్టుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. అయితే, జనసేన మాత్రం ఆంధ్రులకు అండగా ఉంటుందని, వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని పవన్ పేర్కొన్నారు.
Pawan Kalyan
jana sena
East Godavari District
Panchekattu
Andhra Pradesh

More Telugu News