Jagan: బుగ్గలు నిమరడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: పవన్ ధ్వజం

  • అసెంబ్లీకి వెళ్లకుండా నన్ను తప్పుబట్టడమేంటి?
  • భూములను దోచుకున్నా పట్టించుకోలేదు
  • అసెంబ్లీకి వెళ్లి నిలదీస్తే మగతనం బయటపడుతుంది
ప్రతిపక్ష నేత అంటే అసెంబ్లీకి వెళ్లి సీఎంను నిలదీయాలని కానీ వైసీపీ అధినేత జగన్ బుగ్గలు నిమరడం తప్ప ప్రశ్నించడమే మరిచారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి వెళ్లకుండా తనను తప్పుబట్టడాన్ని పవన్ తీవ్రంగా పరిగణించారు.

అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు మగతనం బయటపడుతుందన్నారు. తనకు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ లేరని అయినా తానే ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. అంతమంది ఎమ్మెల్యేలను ఉంచుకుని వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానన్న జగన్.. రెల్లి కులస్థుల భూములను ఆ పార్టీ నేతే దోచుకున్నా పట్టించుకోలేదని పవన్ విమర్శించారు.
Jagan
Pawan Kalyan
YSRCP
Assembly
West Godavari District

More Telugu News