kuntia: మాకు ఒక సీటు ఇస్తామన్న కుంతియా మొహం చాటేశారు: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్

  • మహాకూటమిలోకి ఆహ్వానిస్తేనే వెళ్లాం
  • ఆహ్వానించి తమను అవమానపరుస్తారా?
  • ఢిల్లీకి వెళితే మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు
తమను అవమానించారంటూ కాంగ్రెస్ నేతలపై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు కృషి చేశామని, టీ-కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క తమను మహాకూటమిలోకి ఆహ్వానిస్తే వచ్చామని, తమకు సీట్లు ఇవ్వకుండా అవమానించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

తమకు ఒక సీటు ఇస్తామన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియా మొహం చాటేశారని, ఢిల్లీకి పిలిచి తమను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళితే అక్కడ తమను పట్టించుకున్న నాథుడే లేడని వాపోయారు. రేపు హైదరాబాద్ లో అమరవీరుల స్తూపం వద్ద దీక్షకు దిగుతామని, ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే స్వతంత్రంగా పోటీకి దిగుతామని స్పష్టం చేశారు.
kuntia
Telangana inti party
cheruku sudhakar

More Telugu News