ys family: వైఎస్ కుటుంబంలో అందరూ క్రిమినల్సే!: యనమల రామకృష్ణుడు

  • జగన్ ని కాపాడమని విజయమ్మ కోరడం హాస్యాస్పదం
  • రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కుటుంబాన్ని కాపాడాలా?
  • రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారు
వైఎస్ కుటుంబంలో అందరూ క్రిమినల్సేనంటూ ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ని కాపాడమని విజయమ్మ కోరడం హాస్యాస్పదమని, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కుటుంబాన్ని ఎందుకు కాపాడాలని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.  పవన్, జగన్ లు ప్రధాని మోదీని ఒక్క మాటా అనడం లేదని, ఈ ముగ్గురూ కలిశారని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.  
ys family
yanamala
YS Vijayamma

More Telugu News