నాంపల్లిలో ఉన్నది గాంధీ భవనా? లేక గాంధీ ఆసుపత్రా? అన్న అనుమానం కలుగుతోంది!: మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ నేతలు అక్కడ సెలైన్లు ఎక్కించుకుంటున్నారు
- నేతలు తంతారన్న భయంతో అర్థరాత్రి జాబితా ప్రకటించారు
- మహాకూటమికి ఓటేస్తే తెలంగాణ జుట్టు బాబు చేతిలోనే
కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు సెలైన్లు పెట్టుకుని మరీ ఆందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పత్రికల్లో ఫొటోలు చూస్తుంటే నాంపల్లి దగ్గర ఉన్నది గాంధీ భవనా? లేదా గాంధీ ఆసుపత్రా? అన్న అనుమానం కలుగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ నేతలు తెలంగాణ జుట్టును చంద్రబాబు చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. ఈసారి మహాకూటమికి ఓటు వేస్తే మన వేలితో మన కంట్లోకి పొడుచుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.