varun dhawan: ఆమెతో డేటింగ్ లో ఉన్నా.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: వరుణ్ ధావన్

  • ఫ్యాషన్ డిజైనర్ నటాషాతో డేటింగ్ చేస్తున్నా
  • ఆమె చాలా సాధారణమైన అమ్మాయి
  • ఆమె వ్యక్తిగత వివరాలను బయటపెట్టలేను
గత కొంత కాలంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ లు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే గుసగుసలు బీటౌన్ లో వినిపించాయి. ఎట్టకేలకు ఈ అంశంపై వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. నటాషాతో తాను డేటింగ్ చేస్తున్నానని... ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆమె చాలా సాధారణమైన అమ్మాయని... ఇంతకు మించి ఆమె వ్యక్తిగత వివరాలను బయట పెట్టలేనని తెలిపాడు. ఆమెకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పాడు.

ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ 'కళంక్'లో వరుణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
varun dhawan
natasha dalal
dating
marriage
bollywood

More Telugu News