Andhra Pradesh: సీఎం పదవి పిచ్చి పట్టి జగన్, పవన్ వీధుల్లో తిరుగుతున్నారు!: దేవినేని ఉమ

  • ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడ్డాం
  • రూ.16,000 కోట్ల లోటుతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నాం
  • పేదలకు 14 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నాం
వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఈ రోజు ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టి వీరిద్దరూ వీధుల్లో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. గిరిజన యువకుడు, బాగా చదువుకున్న కిడారి శ్రవణ్ కుమార్ కు మంత్రి పదవి ఇస్తే దాన్ని కూడా ప్రతిపక్షాలు అవహేళన చేయడం దారుణమన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన రూ.16,000 కోట్లు ఇవ్వకపోయినా ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని ఉమ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 20,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశామనీ, రూ.6,500 కోట్ల ఖర్చుతో 14 రకాల పెన్షన్లను అందజేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో నిలువనీడ లేని పేదలకు 14 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వాపోయారు.
Andhra Pradesh
Chandrababu
Jagan
devineni uma
Pawan Kalyan
YSRCP
Jana Sena

More Telugu News