Pawan Kalyan: చంద్రబాబు అబద్ధాలు చూస్తుంటే సముద్రం ఇంకిపోతుందేమో అనిపిస్తోంది: పవన్

  • టీడీపీ, కాంగ్రెస్‌లు తినడానికి పనికిరాని లడ్డూలు
  • వైసీపీ లడ్డూ వాళ్లకు మాత్రమే పనికొచ్చే లడ్డూ
  • బీజేపీ పాచిపోయిన లడ్డూ
సీఎం చంద్రబాబు అబద్ధాలు చూస్తుంటే సముద్రం ఇంకిపోతుందేమో అనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాకినాడలోని కల్పన సెంటర్లో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ.. బీజేపీ పాచిపోయిన లడ్డూ.. టీడీపీ, కాంగ్రెస్‌లు తినడానికి పనికిరాని లడ్డూలు.. వైసీపీ లడ్డూ వాళ్లకు మాత్రమే పనికివచ్చే లడ్డూ అని విమర్శించారు.

రూ.వేల కోట్ల ఖనిజం వంతాడ కొండల నుంచి మాయమవుతున్నా.. రియల్‌టైం గవర్నెన్స్‌ అంటున్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? అని పవన్ ప్రశ్నించారు. అభివృద్ధి కేంద్రీకృతం వల్ల జిల్లాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. గతంలో హైదరాబాద్‌ని అభివృద్ధి చేసి దెబ్బతిన్నామని.. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అదే బాటలో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని పవన్ దుయ్యబట్టారు.
Pawan Kalyan
Chandrababu
BJP
Congress
YSRCP

More Telugu News