Mahesh Babu: ‘సర్కార్’ను ప్రశంసిస్తూ మహేశ్ ట్వీట్.. మండిపడుతున్న తారక్ అభిమానులు

  • మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ అని ట్వీట్
  • ‘అరవింద సమేత’పై స్పందించని మహేశ్
  • సామాజిక మాధ్యమాల వేదికగా మహేశ్‌పై ఆగ్రహం
ఇటీవల ‘సర్కార్’ చిత్రం విషయమై సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ట్వీట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 'సర్కార్' చిత్రాన్ని చూసిన మహేశ్.. ఈ పొలిటికల్ డ్రామా ఎంగేజింగ్‌గా ఉందని.. ఆద్యంతం ఎంజాయ్ చేశానని.. మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిల్మ్ 'సర్కార్' అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తారక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనికి కారణం ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమాపై మహేశ్ అసలు స్పందించలేదు. ఇది తారక్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

అనువాద చిత్రం ‘సర్కార్’ విషయంలో వెంటనే స్పందించిన మహేశ్.. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘అరవింద సమేత’ విషయమై స్పందించకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ‘సర్కార్’ డైరెక్టర్ మురుగదాస్‌తో సినిమా చేశారు కాబట్టి మహేశ్ స్పందించారనుకున్నా.. ‘అరవింద సమేత’ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కూడా సినిమా చేశారు కదా, ఆ విధంగానైనా మహేశ్ స్పందించి ఉండొచ్చు కదా? అని సామాజిక మాధ్యమాల వేదికగా తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu
Junior Ntr
Sarkar Movie
Aravinda Sametha
Trivikram

More Telugu News