bellamkonda srinivas: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'కవచం' టీజర్

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'కవచం'
  • కథానాయికలుగా కాజల్ .. మెహ్రీన్
  • డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు    
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా .. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో 'కవచం' సినిమా నిర్మితమైంది. శ్రీనివాస్ సరసన కథానాయికలుగా కాజల్ .. మెహ్రీన్ నటించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

లవ్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. సినిమాను చాలా రిచ్ గా .. భారీగా తీశారనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. "భయపెట్టేవాడికి .. భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడు .. వాడే పోలీస్' .. 'పోలీస్ తో ఆడాలంటే బులెట్ కంటే బ్రెయిన్ ఫాస్టుగా ఉండాలి' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
bellamkonda srinivas
kajal
mehreen

More Telugu News