Chandrababu: పెండింగ్ జీతాలు అందుకున్న ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్లు.. చంద్రబాబుకు, కామినేనికి కృతఙ్ఞతలు

  • వెయ్యి మంది ఉపాధ్యాయులకు పెండింగ్ జీతాలు
  • కామినేనితో కలిసి సచివాలయానికెళ్లిన ఉపాధ్యాయులు
  • సమస్యపై తక్షణమే స్పందించినందుకు కృతఙ్ఞతలు
పెండింగ్ లో ఉన్న తమ జీతాలు అందుకున్న ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు వారు తమ కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, ఏపీ విద్యాశాఖకు చెందిన దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులకు కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి.

ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కామినేని ఇటీవల తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి, ఆ బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు ఆదేశాలతో తమ జీతాలు అందుకున్న ఉపాధ్యాయులు, కామినేనితో కలిసి చంద్రబాబును కలిసేందుకు ఈరోజు సచివాలయానికి వెళ్లారు. తమ సమస్యపై తక్షణమే స్పందించిన చంద్రబాబుకు, కామినేనికి వారు కృతఙ్ఞతలు చెప్పారు. 
Chandrababu
kamineni
Andhra Pradesh
teachers
pending salaries

More Telugu News