ఎంపీ కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు మధ్య చాలా తేడా వచ్చింది: పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి
- నాలుగున్నరేళ్లుగా కేవలం ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు
- ఇలా అయితే ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారు?
- రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోంది
తాను, కేసీఆర్ ఇద్దరం ఒకేసారి లోక్ సభలో ఉన్నామని... అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చిందని ఈ సందర్భంగా నారాయణస్వామి అన్నారు. ఎవరినీ కలవకుండా కుటుంబపాలనను కేసీఆర్ నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ వరకు వెళ్లడం లేదని... ప్రజలతో మమేకం కాకపోతే వారి సమస్యలను కేసీఆర్ ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.