ananth kumar: కర్ణాటకలో మూడు రోజులు సంతాప దినాలు

  • అనంత్ కుమార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కర్ణాటక ప్రభుత్వం
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు ప్రకటించిన సీఎం
  • దేశ వ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటన
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఆయన గౌరవార్థం మూడు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈరోజును సెలవు దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, అనంత్ కుమార్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు, అనంత్ కుమార్ మరణానికి సంతాప సూచకంగా దేశ వ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 
ananth kumar
bjp
dead
kumaraswamy

More Telugu News