sushmita sen: ఔను... అతనితో డేటింగ్ చేస్తున్నా: సుస్మితా సేన్

  • రోమన్ తో డేటింగ్ చేస్తున్నా
  • ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు
  • పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన సుస్మిత
మోడల్ రోమన్ షాల్ తో బాలీవుడ్ భామ సుస్మితా సేన్ డేటింగ్ చేస్తోందనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలపై సుస్మిత స్పందించింది. రోమన్ తో డేటింగ్ చేస్తున్న విషయం నిజమేనని ఆమె తెలిపింది. అయితే, ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని చెప్పింది.

మోడల్ రోమన్ ను కొన్ని నెలల క్రితం సుస్మిత కలిసింది. పలుమార్లు వీరిద్దరూ కెమరాల కంటికి చిక్కారు. ఇద్దరూ కలసి తాజ్ మహల్ కూడా సందర్శించారు. ఎంతో మంది సెలబ్రిటీ డిజైనర్ల కోసం రోమన్ ర్యాంప్ వాక్ చేశారు. మరోవైపు 40 ఏళ్లు దాటిన సుస్మిత ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు అమ్మాయిలను ఆమె దత్తత తీసుకుని, పెంచుకుంటోంది.
sushmita sen
rohman shawl
bollywood
dating
marriage

More Telugu News