TRS leader died: గుండెపోటుతో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి.. ప్రచారంలో అపశ్రుతి

  • కుత్బుల్లాపూర్‌లో ప్రచారంలో ఉండగా ఘటన
  • భోజనం చేస్తుండగా కుప్పకూలిన వెన్నెలగడ్డకు చెందిన రమేష్‌
  • ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు నిర్థారణ
ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్‌ఎస్‌ నేత ఒకరు గుండె పోటుతో మృతి చెందారు. కుత్బుల్లాపూర్‌లో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.  వెన్నెలగడ్డకు చెందిన రమేష్‌ (57) నాయకులతో పాటు బస్తీలో తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రుక్మిణి ఎస్టేట్‌లో కార్యకర్తల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. రమేష్‌ కూడా కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయారు.

ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన నాయకులు, కార్యకర్తలు రమేష్‌ను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్థారించారు. గుండె పోటుతోనే రమేష్‌ మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
TRS leader died
kutbullapur

More Telugu News