Illeyana: అప్పట్లో అయిష్టంగానే 'పోకిరి' సినిమా చేశాను: ఇలియానా

  • ఇలియానా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా 'పోకిరి'
  • చేయకూడదని అనుకుంటే మంజుల ఒప్పించారు
  • ఇష్టపడి చేసిన చిత్రాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయన్న ఇలియానా
నటిగా తన చలన చిత్ర ప్రయాణంలో ఇష్టపడి చేసిన సినిమాలు ఎన్నో ఫ్లాప్ అయ్యాయని, అయిష్టంగా నటించిన సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయని హీరోయిన్ ఇలియానా వ్యాఖ్యానించింది. దాదాపు ఆరేళ్ల పాటు టాలీవుడ్ కు దూరమైన ఈ భామ, 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆమె చెబుతూ, ఈ ఆరేళ్ల వ్యవధిలో తనకు నచ్చే కథలు రాలేదని, ఒకటి, రెండు నచ్చినా, డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేశానని చెప్పింది.

తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'పోకిరి' గురించి మాట్లాడుతూ, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని తాను అసలు ఊహించలేదని చెప్పింది. వాస్తవానికి ఈ సినిమా చేయకూడదని తాను అనుకున్నానని, ఆ సమయంలో మహేష్ బాబు సోదరి మంజుల తనను ఒప్పించారని చెప్పుకొచ్చింది. ఆ సినిమా తన కెరీర్ కు ఎంతో ఉపకరించిందని, ఆ తరువాత ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని నిరాశ పరిచాయని అంది. ఏ సినిమా చేసినా దాన్నుంచి కొంతైనా నేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నానని ఇలియానా అంటోంది.
Illeyana
Pokiri
Mahesh Babu
Manjula
Tollywood

More Telugu News