balakrishna: 'మహానాయకుడు' రిలీజ్ డేట్ మార్పు?

  • షూటింగు దశలోఎన్టీఆర్ బయోపిక్ 
  • జనవరి 9న 'కథానాయకుడు'
  • ఫిబ్రవరి 14వ తేదీన 'మహానాయకుడు'
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చకచకా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు వస్తోన్న ఫస్టులుక్ పోస్టర్స్ అందరిలోను అంచనాలు పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన అంశాలతో 'కథానాయకుడు' .. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలతో 'మహానాయకుడు'ను విడుదల చేయనున్నారు.

'కథానాయకుడు' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 'మహానాయకుడు'ను జనవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అయితే రెండు భాగాల మధ్య రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉండటంతో, గిట్టుబాటు కాదనే అభిప్రాయాన్ని బయ్యర్లు వ్యక్తం చేశారట. దాంతో 'మహానాయకుడు'ను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని అంటున్నారు.   
balakrishna
kalayan ram

More Telugu News