Srinivasa Rao: శ్రీనివాసరావు స్నేహితురాళ్లు, సోదరిని మరోసారి విచారించిన పోలీసులు!

  • విజయదుర్గతో పాటు అమ్మాజీ, సయ్యద్ బీల విచారణ
  • విశాఖకు పిలిపించి ప్రశ్నించిన సిట్ వర్గాలు
  • వీరిని సాక్షులుగా ప్రవేశపెట్టే అవకాశం
వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు సోదరి, లేఖలో కొంతభాగాన్ని రాసిన విజయదుర్గతో పాటు, శ్రీనివాస్ స్నేహితురాళ్లు, అతనితో ఫోన్లో పలుమార్లు మాట్లాడిన కనిగిరికి చెందిన షేక్ అమ్మాజీ, సయ్యద్ బీలను రహస్యంగా విశాఖకు పిలిపించి పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. గత నెలలో ఘటన జరిగిన అనంతరం రెండు రోజుల తరువాత వీరిని ఓ మారు విచారించిన సంగతి తెలిసిందే. ఆపై వీరిని ఇంటికి పంపేశారు.

 తాజాగా, వీరిని మరోసారి విశాఖ తీసుకు వచ్చి, అదనపు సమాచారం సేకరించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఓ మహిళను ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ లో, మిగతా ఇద్దరినీ మరో ప్రాంతంలో సీక్రెట్ గా విచారించినట్టు తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దర్యాఫ్తు ముందుకు సాగుతోందని సిట్ వర్గాలు అంటున్నాయి. వీరిని కేసులో సాక్షులుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
Srinivasa Rao
Jagan
Murder Attempt
Vizag
Airport
SIT
Enquiry

More Telugu News